Header Banner

ఏపీలో ప్రజలకు భారీ శుభవార్త! ఇకపై రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు!

  Sat Feb 22, 2025 14:36        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. ఇకపై రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2024 డిసెంబరు 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి విముక్తి కల్పించింది. 2024 డిసెంబరులో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్‌ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. దానికి గవర్నర్‌ అనుమతితో ఇటీవలే గెజిట్‌ విడుదల కాగా.. ఇప్పుడు మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 'రాష్ట్రంలో చెత్త పన్ను వసూళ్లకు ఏపీ మున్సిపల్‌ చట్టం-1965లో చేర్చిన సెక్షన్‌ 170-బి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955లోని సెక్షన్‌ 491-ఎ ను తొలగిస్తున్నట్లు' ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2021 నవంబరులో 40 మున్సిపాలిటీ, కార్పొరేషన్ సంస్థల్లో ప్రజల నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


రూ.187.02 కోట్ల మేర వసూలు చేసింది. చెత్త పన్ను వసూలుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ అంశాన్ని కూటమి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్నును తొలగిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతేడాది గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తును పూర్తి చేసి అసెంబ్లీ ముందుకు బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు.. అనంతరం గవర్నర్ దగ్గర గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరూ చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AP #goodnews #todaynews #flashnews #tax #latestupdate